బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తడబడుతోంది. ఎవరూ ఊహించనవి విధంగా టాపార్డర్ విఫలం అవడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. సూపర్ ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్ (8)తోపాటు యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (7) ఈ మ్యాచ్‌లో నిరాశపరిచారు. ఆ తర్వాత వచ్చిన అశ్విన్ (17) నాలుగు బౌండరీలు బాది ఫర్వాలేదనిపించాడు. ఇలాంటి సమయంలో ఇన్నింగ్స్ నిర్మించాల్సిన బాధ్యత తలెత్తుకున్న కెప్టెన్ సంజూ శాంసన్ (27).. హసరంగ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌కు ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత కాసేపటికే పదిహేనో ఓవర్లో బంతి అందుకున్న హాజిల్‌వుడ్.. కివీస్ ఆల్‌రౌండర్ డారియల్ మిచెల్ (16)ను పెవిలియన్ చేర్చాడు. భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన మిచెల్.. లాంగాన్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చాడు. దీంతో అతను వెనుతిరగాల్సి వచ్చింది. ప్రస్తుతం రాజస్థాన్ జట్టు 99 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది.
Josh Hazlewood strikes again and Daryl Mitchell has to go.#RR 5 down for 99.
Live – https://t.co/fVgVgn1vUG #RCBvRR #TATAIPL pic.twitter.com/1ejZrQNfJw
— IndianPremierLeague (@IPL) April 26, 2022