రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కెప్టెన్ డుప్లెసిస్ (23) మినహా మిగతా బ్యాటర్లు విరాట్ కోహ్లీ (9), మ్యాక్స్‌వెల్ (0) పూర్తిగా విఫలమయ్యారు. యువ ఆటగాళ్లు రజత్ పటీదార్ (16), సూయష్ ప్రభుదేశాయి (2) కూడా ఆకట్టుకోలేకపోయారు.
ఎన్నో ఆశలు పెట్టుకున్న దినేష్ కార్తీక్ (6) రనౌట్‌గా వెనుతిరిగాడు. దీంతో ఆ జట్టు విజయావకాశాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం క్రీజులో షాబాజ్ అహ్మద్, హసరంగ ఉన్నారు. 13 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు జట్టు 6 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది.