RCB vs MI | ఉత్కంఠ పోరులో రోహిత్ సేనపై పరుగుల తేడాతో కోహ్లీసేన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌తో భారీ స్కోర్‌నే చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఆ తర్వాత బౌలింగ్‌తోనూ ముంబై ఇండియన్స్‌ను కట్టడి చేసింది. ఒకానొక దశలో హర్షల్ పటేల్ హ్యాట్రిక్ వికెట్లు తీసి ముంబైని కష్టాల్లోకి నెట్టాడు. వరుస వికెట్లు కోల్పోవడంతో తడబాటుకు లోనైన ముంబై ఆటగాళ్లు.. ఇంకా 11 బంతులు ఉండగానే ఆలౌటయ్యారు. దీంతో 54 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌లోకి దిగిన కోహ్లీసేన.. ఆరంభం నుంచి పరుగుల వేట మొదలుపెట్టింది. పడిక్కల్ డక్కౌట్ అయినప్పటికీ.. విరాట్ కోహ్లీ (51), మ్యాక్స్‌వెల్ (56)తో రాణించారు. శ్రీకర్ భరత్ 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కానీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ ఆకట్టుకోలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేశారు.
166 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ 18.1 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే 43 పరుగులు చేయగలిగాడు. డికాక్ 24 పరుగులకే ఔటయ్యాడు. బెంగళూరు బౌలింగ్‌తో కట్టడి చేయడంతో మిగిలిన ప్లేయర్లు ఎవరూ డబుల్ డిజిట్ సాధించలేకపోయారు. దీంతో 19వ ఓవర్ మొదలయ్యేసరికి అందరూ ఆలౌటయ్యారు.
That's that from Match 39.#RCB WIN by 54 runs!
— IndianPremierLeague (@IPL) September 26, 2021
Scorecard – https://t.co/KkzfsLzXUZ #RCBvMI #VIVOIPL pic.twitter.com/BjMwBoAlmJ