RCB Vs GT | బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ పరుగులను నియంత్రించడంతో పాటు బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. దాంతో ఫిల్ సాల్ట్ (14), విరాట్ కోహ్లీ (7), దేవ్‌దత్ పడిక్కల్ (4), రజత్ పాటిదార్ (12) పరుగులకే వెనుదిరిగారు. గుజరాత్ బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ కుప్పకూలింది.
15 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఆర్సీబీ 105 పరుగులు మాత్రమే చేయగలిగింది. 15 ఓవర్లో సాయికిశోర్ బౌలింగ్‌లో కృణాల్ పాండ్యా (5) అతనికే ఇచ్చి అవుట్ అయ్యాడు. అంతకు ముందు సాయి కిశోర్ బౌలింగ్‌లోనే జితేశ్ శర్మ బౌలింగ్‌లో రాహుల్ తెవాటియాక క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఐదు ఫోర్లు, సిక్సర్ సహాయంతో 33 పరుగులు చేసి ఫుల్ ఫామ్‌లో ఉన్న జితేశ్ శర్మను సాయి కిశోర్ పెవిలియన్‌కు చేరాడు. లియామ్ లివింగ్‌స్టోన్ క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం లివింగ్ స్టోన్, టివ్ డేవిడ్ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 16 ఓవర్లలో 119 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో సిరాజ్‌కు రెండు, సాయి సుదర్శన్‌కు రెండు వికెట్లు, అర్షద్ ఖాన్‌కు ఒకటి, ఇషాంత్ శర్మకు చెరో వికెట్ దక్కింది.