RCB Vs GT | ఐపీఎల్లో భాగంగా బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాట్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్నది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి గుజరాత్ బౌలర్లు షాక్ ఇచ్చారు. పది ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (14), విరాట్ కోహ్లీ (7), దేవ్‌దత్ పడిక్కల్ (4), రజత్ పాటిదార్ (12) పరుగులకే పెవిలియన్‌కు చేరారు. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ బ్యాటింగ్ నెమ్మదిగా సాగుతున్నది. ఏడు ఓవర్లోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం లివింగ్ స్టోర్ 8, జితేశ్ శర్మ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. సిరాజ్‌కు రెండు వికెట్లు, అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మకు చెరో వికెట్ దక్కింది.