RCB Vs GT | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్ బెంగళూరు, గుజరాత్ టైటాట్స్ మధ్య మరికొద్ది సేపట్లో మ్యాచ్ మొదలుకానున్నది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్‌లో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేయనున్నది. ఇప్పటికే రెండు విజయాలతో పాయింట్ల పట్టికల అగ్రస్థానంలో ఉన్న ఆర్సీబీ.. వరుసగా మూడో మ్యాచ్‌లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలనే ఉద్దేశంతోనే బరిలోకి దిగుతున్నది.
ఆడిన రెండు మ్యాచుల్లో ఒక మ్యాచ్‌లో విజయం సాధించి.. మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆర్సీబీఐ సొంత మైదానంలోనే ఓడించాలని శుభ్‌మన్ గిల్ సేన చూస్తున్నది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, ఆ తర్వాత చెన్నైని ఓడించిన ఆర్సీబీకి.. ఈ సీజన్లో సొంత మైదానంలో తొలి మ్యాచ్ ఆడబోతున్నది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్లు జోష్ హాజెల్‌వుడ్, భవనేశ్వర్ కుమార్‌నే నమ్మకం పెట్టుకున్నది. ఇక గుజరాత్ చివరి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఒక మార్పు చేసింది. కగిసో రబాడా ఆడడం లేదని.. అతని స్థానంలో అర్షద్ ఖాన్‌ను తుదిజట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు. ఆర్సీబీ కెప్టెన్ మాట్లాడుతూ గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన జట్టుతోనే ఆడుతున్నట్లు పేర్కొన్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ సబ్స్: సుయాష్ శర్మ, రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్.
గుజరాత్ఇంపాక్ట్ సబ్స్: రూథర్‌ఫోర్డ్, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, వాషింగ్టన్ సుందర్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు : ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్.
గుజరాత్ టైటాన్స్ జట్టు : సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ