RCB vs DC | ఐపీఎల్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన పోరులో 7 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగు పరుగులకే ఔట్ అయినప్పటికీ.. శ్రీకర్ భరత్ (78) మ్యాక్స్‌వెల్ ( 51)తో హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఢిల్లీ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఆదిలోనే షాక్‌లు తగిలాయి. ఓపెనర్ పడిక్కల్ డకౌట్ అవ్వగా.. కెప్టెన్ కోహ్లీ నాలుగు పరుగులకే పెవిలియన్ వెనుదిరిగారు. డివిలియర్స్ (26) కూడా ఆకట్టుకోలేకపోయాడు. కానీ శ్రీకర్ భరత్, మ్యాక్స్‌వెల్ ఇద్దరూ భారీ పరుగులు చేసి బెంగళూరును గెలిపించారు. ఢిల్లీ బౌలర్లలో నోర్జే రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు.
WHAT. A. FINISH!@KonaBharat finishes it off in style as #RCB win by 7 wickets.
— IndianPremierLeague (@IPL) October 8, 2021
Scorecard – https://t.co/BHBv8DLyMl #RCBvDC #VIVOIPL pic.twitter.com/eYGWOIUdlN
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించారు. పృథ్వీ షా (48), శిఖర్ ధవన్ (43) పరుగులతో రాణించారు. హెట్‌మైర్ (29) , శ్రేయస్ అయ్యర్ (18) ఫర్వాలేదనిపించారు. ఇక మిగిలిన ప్లేయర్లు నిలకడగా ఆడుతూ నిర్ణీత 20ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేశారు.