బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ మరో వికెట్ కోల్పోయింది. ఆటపై ఫోకస్ పెట్టేందుకు కెప్టెన్సీ వదులుకున్న రవీంద్ర జడేజా (3) ఆటతీరు మారలేదు. హర్షల్ పటేల్ వేసిన పదహారో ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన అతను.. బంతిని సరిగా టైమింగ్ చేయలేకపోయాడు.
దీంతో గాల్లోకి చాలా ఎత్తుగా లేచిన బంతిని కోహ్లీ అందుకున్నాడు. ఎటువంటి పొరపాటూ చేయకుండా అతను చక్కగా క్యాచ్ అందుకోవడంతో రవీంద్ర జడేజా మైదానం వీడాడు. దీంతో 122 పరుగుల వద్ద చెన్నై జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. జడ్డూ అవుటవడంతో ధోనీ క్రీజులోకి వచ్చాడు. చెన్నై విజయానికి 24 బంతుల్లో ఇంకా 52 పరుగులు చేయాల్సి ఉంది.