రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో వికెట్ కోల్పోయింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రజత్ పటీదార్ (21) అవుటయ్యాడు. డ్వెయిన్ ప్రిటోరియస్ వేసిన 16వ ఓవర్ తొలి బంతికే పటీదార్ పెవిలియన్ చేరాడు. భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన పటీదార్.. బంతిని సరిగా టైమింగ్ చేయలేకపోయాడు.
దీంతో బాగా ఎత్తుగా గాల్లోకి లేచిన బంతిని ముఖేష్ చౌదరి పరిగెత్తుకుంటూ వచ్చి పట్టేశాడు. ఈ అద్భుతమైన క్యాచ్‌తో పటీదార్ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీంతో 123 పరుగుల వద్ద బెంగళూరు జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది.