చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు జట్టు తొలి వికెట్ కోల్పోయింది. గాయం కారణంగా ఆటకు దూరమైన మొయీన్ అలీ.. మళ్లీ పునరాగమనం చేసిన తొలి ఓవర్లోనే వికెట్ తీసుకున్నాడు. ధాటిగా ఆడుతున్న డుప్లెసిస్ (38)ను పెవిలియన్ చేర్చాడు.
అలీ వేసిన బంతిని పుల్ చేసి భారీ షాట్ ఆడేందుకు డుప్లెసిస్ ప్రయత్నించాడు. గాల్లోకి లేచిన బంతిని డీప్ మిడ్‌వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జడేజా అందుకున్నాడు. దీంతో డుప్లెసిస్ నిరాశగా మైదానం వీడాడు. మ్యాక్స్‌వెల్ క్రీజులోకి వచ్చాడు.