T20 World Cup 2026 : యాషెస్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ (England) వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా సాగుతోంది. త్వరలో శ్రీలంకతో వన్డే, పొట్టి సిరీస్ ఆడనున్న ఇంగ్లీష్ టీమ్.. ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని స్క్వాడ్‌ను ప్రకటించింది. హ్యారీ బ్రూక్ కెప్టెన్‌గా మందితో 15 మందితో కూడిన బృందాన్ని ఇంగ్లండ్ బోర్డు వెల్లడించింది. నిరుడు ప్రపంచకప్ టీమ్‌లోని ఎనిమిది మంది మరోసారి చోటు దక్కించుకున్నారు.
భారత్, శ్రీలంక వేదికగా వచ్చే ఫిబ్రవరిలో పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ సన్నద్ధతలో ఉన్న ఇంగ్లండ్ జనవరిలో లంక పర్యటనకు వెళ్లనుంది ఇంగ్లండ్. ఈసారి ప్రపంచకప్ కోసం సీనియర్లతో పాటు ఇద్దరు జూనియర్లకు సెలెక్టర్లు స్క్వాడ్‌లోకి తీసుకున్నారు. వీరిలో జాకబ్ బెథెల్(Jacob Bethell) జాక్‌పాట్ కొట్టాడనే చెప్పాలి. ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తరఫున అదరగొట్టిన బెథెల్.. తాజాగా మెల్బోర్న్ టెస్టులో 40 పరుగులతో రాణించాడు. గాయం నుంచి కోలుకుంటున్న జోఫ్రా ఆర్చర్ (Jofra Archer), మెల్బోర్న్ టెస్టులో ఐదు వికెట్లతో మెరిసిన జోష్ టంగ్ (Josh Tongue)లకు స్క్వాడ్‌లో చోటు దక్కింది.
JUST IN: England have named their provisional squad for the upcoming T20 World Cup pic.twitter.com/JdTqF5Z7UH
— ESPNcricinfo (@ESPNcricinfo) December 30, 2025
ఇంగ్లండ్ టీ20, ప్రపంచకప్ స్క్వాడ్ : ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, లియాం డాసన్, సామ్ కరణ్, ఆదిల్ రషీద్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.
ఇంగ్లండ్ వన్డే స్క్వాడ్ : బెన్ డకెట్, జాక్ క్రాలే, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్(వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, జో రూట్, టామ్ బ్యాంటన్, విల్ జాక్స్, సామ్ కరన్, జేమీ ఓవర్టన్, లియాం డాసన్, ఆదిల్ రషీద్, రెహాన్ అహ్మద్, బ్రైడన్ కార్సే, ల్యూక్ వుడ్.
JUST IN: England have named their provisional squad for the upcoming T20 World Cup pic.twitter.com/JdTqF5Z7UH
— ESPNcricinfo (@ESPNcricinfo) December 30, 2025
ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ వైట్‌బాల్ సిరీస్ (మూడు వన్డేలు, మూడు టీ20లు) కోసం ఇంగ్లండ్ జనవరిలో శ్రీలంకకు వెళ్లనుంది. జనవరి 22న ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరుగనుంది. అనంతరం జనవరి 30 నుంచి పొట్టి సిరీస్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి పొట్టి ప్రపంచకప్ షురూ అవుతుంది. తొలిపోరులో ఇంగ్లండ్ ఫిబ్రవరి 8న నేపాల్‌ను ఢీకొట్టనుంది.