భారత్‌లో కరోనా ఉద్ధృతి ఆందోళనకరంగా ఉండటంతో ఐపీఎల్లో ఆడుతున్న పలువురు విదేశీ ఆటగాళ్లు స్వదేశానికి బయల్దేరి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2021 సీజన్ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన ఆటగాళ్ల స్థానంలో ఇతర ఫ్రాంఛైజీల నుంచి తీసుకునే వెసులుబాటు ఉంది.
కరోనా భయంతో స్వదేశానికి వెళ్లిపోయిన ఆస్ట్రేలియా క్రికెటర్ కేన్ రిచర్డ్సన్ స్థానంలో
న్యూజిలాండ్ పేసర్ స్కాట్ కుగెలిన్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి తీసుకుంది. కుగెలిన్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు రిజర్వ్ ఆటగాడిగా బయో సెక్యూర్ బబుల్‌లోనే ఉన్నాడు.
29 ఏండ్ల కుగెలిన్ బెంగళూరు జట్టులో చేరాడని ప్రాంఛైజీ ట్విటర్లో పేర్కొంది. ‘ఐపీఎల్ ప్రొటోకాల్ ప్రకారం.. కుగెలిన్కు కొవిడ్ నెగెటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాత కేన్ రిచర్డ్సన్ స్థానంలో అహ్మదాబాద్‌లోని ఆర్సీబీ బయోబుబల్లోకి అడుగుపెట్టాడని’ బెంగళూరు ట్వీట్ చేసింది.
Scott Kuggeleijn has now joined the RCB bio-bubble in Ahmedabad as a replacement for Kane Richardson after testing negative on his arrival, adhering to IPL protocols. #PlayBold #WeAreChallengers #IPL2021 #NowAChallenger pic.twitter.com/976cOkaWgz
— Royal Challengers Bangalore (@RCBTweets) April 28, 2021