IPL 2023 : ఆర్సీబీ సగం వికెట్లు కోల్పోయింది. దంచికొడుతున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్(24) ఔటయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో వార్నర్ క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు. అక్షర్ పటేల్ వేసిన 14వ ఓవర్లో హర్షల్ పటేల్ (6) ఔటయ్యాడు. షహబాజ్ అహ్మద్, దినేశ్ కార్తిక్ క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్లో మహిపాల్ లొమ్రోర్(26) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. దాంతో, 117 రన్స్ వద్ద ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. మిచెల్ మార్ష్ ఓవర్లో కీపర్ అభిషేక్ పొరెల్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. 14.1 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్.. 132/5