Yash Dayal : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అత్యాచార నిందితుడైన పేసర్ యశ్ దయాల్ (Yash Dayal)పై వేటు వేసింది ఆర్సీబీ. ఈ ఏడాది దయాల్ తమ ఫ్రాంచైజీ తరఫున ఆడడం లేదని డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బొబత్(Mo Bobat) వెల్లడించాడు. అయితే.. అతడి కాంట్రాక్ట్‌ను మాత్రం రద్దు చేయడం లేదని బొబత్ తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అతడిని ఆడించవద్దని ఫ్రాంచైజీ భావిస్తున్నట్టు బొబత్ పేర్కొన్నాడు.
పంతొమ్మిదో సీజన్ ఐపీఎల్‌కు పలువురు ఆటగాళ్లు దూరమవుతున్నారు. వీరిలో చాలామంది గాయం కారణంగా టోర్నీకి అందుబాటులో ఉండడం లేదు. ఆర్సీబీ ప్రధాన పేసర్ జోష్ హేజిల్‌వుడ్ కొన్ని మ్యాచ్‌లకు దూరం కానుండగా.. యువ పేసర్ యశ్ దయాల్ ఏకంగా సీజన్ మొత్తం దూరమవ్వనున్నాడు. అలాగని అతడు గాయపడలేదు. బెంగళూరు యాజమాన్యమే అతడిపై వేటు వేసింది.
🚨RCB MO BOBAT ON YASH DAYAL l OUT OF IPL 2026🚨
– He confirmed that Yash will not join RCB for IPL 2026 due to personal reasons.🤯
He added that Dayal still remains under contract with RCB, and the franchise is fully supporting him during this time🤨
pic.twitter.com/RZyXlM5y0U— Sam (@Cricsam01) March 24, 2026
అత్యాచారం కేసులో నిందితుడైన దయాల్‌కు ఈసారి స్క్వాడ్‌లో చోటు లేదని ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బొబత్ స్పష్టం చేశాడు. ‘యశ్ దయాల్ ఆర్సీబీ స్క్వాడ్‌లో చేరడం లేదనే విషయాన్ని మీ అందరికి తెలియజేస్తున్నా. ప్రస్తుతం అతడు వ్యక్తిగత జీవితంలోని కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకూ మేము అతడికి మద్దుతుగా నిలిచాం. పంతొమ్మిదో సీజన్ కోసం మేము దయాల్‌ను అట్టిపెట్టుకోవడం ద్వారా ఈ విషయం స్పష్టమవుతుంది. అయితే.. అతడి కాంట్రాక్ట్ కొనసాగుతుంది. దయాల్‌తో మేము తరచూ మాట్లాడుతున్నాం. ఈ రోజు ఉదయం కూడా నేను అతడితో మాట్లాడాను. ప్రస్తుత పరిస్థితుల్లో అతడిని ఫ్రాంచైజీకి దూరంగా ఉంచడమే మంచిదని భావించాం. అందుకే స్క్వాడ్‌లో అతడు చేరడం లేదు. ఈ విషయంపై ఇప్పుడే కామెంట్ చేయదలచుకోలేదు’ అని మీడియా సమావేశంలో బొబత్ వెల్లడించాడు.
🚨 “RAPE NUDE ” INVOLVED YASH DAYAL SIDELINED BY RCB 🚨
“ Yash Dayal sidelined by RCB team management due to being involved in POCSO Act FIR filled in Jaipur ”
Before this — he didn’t played in UP premier league due to POCSO Act 🤯
— Indian Cricket Netwrk (@ICN_Updates01) March 20, 2026
డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఈసారి బౌలింగ్ కష్టాలు ఎదుర్కొంటోంది. ప్రధాన పేసర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం నుంచి కోలుకోలేదు. అతడు కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యేలా ఉన్నాడు. యశ్ దయాల్ సైతం ఆడడం లేదు. దాంతో, బౌలింగ్ భారం రసిక్, మంగేశ్ వంటి కుర్రాళ్లపై పడనుంది. మార్చి 28న జరిగే ఆరంభ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్సీబీ తలపడనుంది.