RCB : ఐపీఎల్ చరిత్రలో తొలిసారి విజేతగా అవతరించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Begaluru) మరో ఘనత సాధించింది. 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈ ఏడాది ట్రోఫీ కలను సాకారం చేసుకున్న ఆర్సీబీ నికర ఆస్తుల విలువ అమాంతం పెరిగింది. ‘ఐపీఎల్ ఛాంపియన్’ ట్యాగ్ వచ్చి చేరి ఆరు నెలలు కూడా కాలేదు అంతలోనే అత్యంత విలువైన ఫ్రాంచైజీ అనిపించుకుంది. అమెరికాకు చెందిన హౌలిహన్ లొకే (Houlihan Lokey) అనే ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ తాజా లెక్కల ప్రకారం ఆర్సీబీ విలువ ఏకంగా 13శాతం పెరిగింది. ఏకంగా రూ.1.6 లక్షల కోట్ల మార్కెట్ విలువతో ప్రత్యర్థులకు షాకిచ్చింది బెంగళూరు ఫ్రాంచైజీ. అదే సమయంలో ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ 14శాతం పెరిగడంతో.. రూ.33,000 కోట్లకు చేరింది.
ఐపీఎల్లో నిలకడైన ప్రదర్శన, భారీగా అభిమానగణం, బ్రాండ్ ప్రమోషన్లో వ్యూహాత్మంగా వ్యవహరించడం వంటివి ఆర్సీబీకి అత్యంత విలువైన ఫ్రాంచైజీ హోదాను కట్టబెట్టాయి. దాంతో, ఐదుసార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్ మూడో స్థానానికి పడిపోగా.. ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ముంబై, సీఎస్కే ఫ్రాంజైజీల విలువ 20 వేల కోట్ల పైనే ఉంది. మాజీ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ మార్కెట్ విలువ రూ.19.46 వేల కోట్లుగా ఉందని హౌలిహన్ లొకే వెల్లడించింది.
🚨 IPL BRAND VALUATION UPDATE 🚨
The Indian Premier League is now valued at a staggering ₹1.56 Lakh Crore! @RCBTweets takes the top spot as the most valuable franchise, while @PunjabKingsIPL records a massive 39.6% growth!#IPL2025 #IPL #Cricket #IndianCricket… pic.twitter.com/OiNHQ37FSq— myKhel.com (@mykhelcom) July 8, 2025
ఆర్సీబీ మాదిరిగా తమ బ్యాండ్ వాల్యూను పెంచుకోవడంలో పలు ఫ్రాంజైజీలు విఫలం అయ్యాయి. మాజీ ఛాంపియన్లు సన్రైజర్స్, రాజస్థాన్, గుజరాత్ టైటాన్స్లు టాప్ -5లో చోటు దక్కించుకోలేకపోయాయి. సన్రైజర్స్ హైదరాబాద్ (రూ.13.20 వేల కోట్లు), ఢిల్లీ క్యాపిటల్స్(రూ.13.03 వేల కోట్లు), రాజస్థాన్ రాయల్స్(రూ.12.51 వేల కోట్లు), గుజరాత్ టైటాన్స్(రూ.12.17 వేల కోట్లు) వరుసగా ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయని.. ఆశ్చర్యంగా 18వ సీజన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్ రూ.12.08 వేల కోట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచిందని అమెరికా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ పేర్కొంది.