IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో తొలిసారి వరుణుడు టాస్కు అడ్డుపడుతన్నాడు. శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), పంజాబ్ కింగ్స్(Punjab Kings)ల మధ్య మ్యాచ్ టాస్ ఆలస్యం కానుంది. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7 గంటలకు టాస్ వేయాలి. అయితే.. వాన కారణంగా టాస్‌ను వాయిదా వేశారు రిఫరీ. చినకులు తగ్గాక టాస్ వేయనున్నారు.
తొలి కప్ వేటలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి అదరగొడుతుంది. కానీ, సొంత గడ్డపై మాత్రం పటిదార్ బృందం చతికిలపడుతోంది. ఇప్పటికే చిన్నస్వామి మైదానంలో రెండు మ్యాచుల్లో ఓడిన ఆర్సీబీ.. శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది. ఈ పోరులో గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాల్ని మరింత మెరుగుపరచుకోవాలని బెంగళూరు భావిస్తోంది.
Toss in Bengaluru has been delayed due to rain 🌧
Stay tuned for further updates #TATAIPL | #RCBvPBKS pic.twitter.com/S2b3uu9ILC
— IndianPremierLeague (@IPL) April 18, 2025
ఐపీఎల్ రికార్డులు గమనిస్తే.. గతంలో ఇరుజట్లు నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. పంజాబ్ 17 విజయాలు సాధించగా.. ఆర్సీబీ 16 పర్యాయాలు విజేతగా నిలిచింది. 18వ ఎడిషన్‌లో రెండు టీమ్‌లు నాలుగేసి విజయాలతో వరుసగా 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నాయి. సొంతగడ్డపై స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న అయ్యర్ సేన కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తు చేసి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇక.. రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించిన ఆర్సీబీ విజయోత్సాహంతో బరిలోకి దిగనుంది.