IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మినీ వేలం(Mini Auction) ప్రక్రియకు టైమ్ దగ్గరపడడంతో ఫ్రాంచైజీలు ఆటగాళ్ల మార్పిడిని వేగవంతం చేశాయి. ఇప్పటికే తొలి ఏడాదే టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా(Hardhik Pandya)ను గుజరాత్ టైటాన్స్.. ముంబైకి అప్పగిస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్ల మధ్య ఆటగాళ్ల మార్పిడికి ఒప్పందం కుదిరింది.
ఆర్సీబీ మేనేజ్మెంట్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్(Shabaz Ahmed)ను ఆరెంజ్ ఆర్మీకి బదిలీ చేస్తుండగా.. బెంగళూరుకు స్పిన్నర్ మయాంక్ దగర్(Mayank Dagar)ను ఎస్ఆర్హెచ్ అప్పజెప్పనుంది. 2022 మినీ వేలంలో హైదరాబాద్ దగర్ను రూ.1.8 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక షాబాద్ కోసం ఆర్సీబీ రూ.2.4 కోట్లు పెట్టింది. 16వ సీజన్లో మూడు మ్యాచులాడిన దగర్ ఒకే ఒక వికెట్ తీసి నిరాశపరిచాడు. ఇక షాదాబ్ బ్యాటుతో, బంతితో దారుణంగా విఫలమయ్యాడు.
హార్దిక్ పాండ్యా
ఐపీఎల్ 16వ సీజన్లో ఫాఫ్ డూప్లెసిస్ సారథ్యంలోని ఆర్సీబీ ప్లే ఆఫ్స్ ముందు తడబడింది. విరాట్ కోహ్లీ శతకంతో గర్జించినప్పటికీ శుభ్‌మన్ గిల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో మరోసారి ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. ఇక హైదరాబాద్ అయితే.. దారుణమైన ఆటతో నిరాశపరిచింది. ఐపీఎల్ 17వ సీజన్ మినీ వేలం త్వరలోనే జరుగునుంది. ఈసారి వేలంలో వరల్డ్ కప్(ODI World Cup 2023)లో దంచికొట్టిన న్యూజిలాండ్ యువ ఓపెనర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra) భారీ ధర పలికే అవకాశం ఉంది.