IND vs AUS | రేపే భారత్, ఆస్ట్రేలియా రెండో టీ20.. వరుణుడు అడ్డుపడేనా..?
IND vs AUS : వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో కంగుతిన్న భారత్.. ఐదు టీ20ల సిరీస్ ఆరంభ పోరులో అదరగొట్టింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఔరా అనిపించింది. సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) నేతృత్వంలోని యువభారత్ రేపు రెండో టీ20కి సిద్ధమవుతోంది. సిరీస్‌లో కీలకమైన ఈ మ్యాచ్‌కు...
IND vs AUS : వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో కంగుతిన్న భారత్.. ఐదు టీ20ల సిరీస్ ఆరంభ పోరులో అదరగొట్టింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఔరా అనిపించింది. సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) నేతృత్వంలోని యువభారత్ రేపు రెండో టీ20కి సిద్ధమవుతోంది. సిరీస్‌లో కీలకమైన ఈ మ్యాచ్‌కు తిరువనంతపురం ఆతిథ్యం ఇస్తోంది. అయితే.. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే చాన్స్ ఉంది.
ఆదివారం ఉదయం, మధ్యాహ్నం వర్ష సూచన ఉందని శనివారం వాతావరణ శాఖ తెలిపింది. కానీ, సాయంత్రం వరకూ ఆకాశంలో మబ్బులు తేలిపోతాయని స్పష్టం చేసింది. తొలి టీ20లో గెలుపొందిన భారత్ తిరువనంతపురంలోనూ జోరు కొనసాగించాలని భావిస్తుండగా.. ఆసీస్ బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉంది. వైజాగ్‌లో గురువారం భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో టీమిండియా సూపర్ విక్టరీ కొట్టింది. సూర్యకుమార్ యాదవ్ (80 : 42 బంతుల్లో ఫోర్లు, సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. డాషింగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(58: 39 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు)తో జట్టును గెలుపు వాకిట నిలిపారు.
సూర్యకుమార్ యాదవ్ (80)

ఆ తర్వాత రింకూ సింగ్(28 నాటౌట్), టెయిలెండర్లతో కలిసి లాంచనం పూర్తి చేశాడు. దాంతో, భారత్ పొట్టి ఫార్మాట్లో రికార్డు లక్ష్యాన్ని (209 పరుగులు) ఛేదించింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి పోరులో వాషింగ్టన్ సుందర్, అవేశ్ ఖాన్‌లను పక్కనబెట్టిన భారత్.. ఈసారి వాళ్లకు అవకాశమిస్తుందా? లేదా అదే జట్టును ఆడిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.
భారత తుది జట్టు అంచనా : యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్‌కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్(కెప్టెన్), తిలక్‌వర్మ, శివమ్‌దూబే, రింకూసింగ్, అక్షర్‌పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, ముకేశ్‌కుమార్.
ఆస్ట్రేలియా తుది జట్టు అంచనా: స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, స్టొయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(కెప్టెన్, వికెట్ కీపర్)), సియాన్ అబాట్, నాథన్ ఎల్లిస్, బెహెన్‌డార్ఫ్, తన్వీర్ సంగా.
ఇవి కూడా చదవండి
-
Paris Olympics 2024 | ప్యారిస్ ఒలింపిక్స్.. భారత రెజ్లర్ల ఎంపికకు రెండంచెల ప్రక్రియ
-
Sanjay Raut | హిట్లర్ ట్వీట్ ఇజ్రాయెల్‌ను బాధపెట్టేందుకు కాదు.. ఎంబసీ లేఖపై సంజయ్ రౌత్ స్పందన
-
KTR | తెలంగాణలో పదేండ్లలో ఒక్క మత ఘర్షణ కూడా జరగలేదు : మంత్రి కేటీఆర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

