కాన్పూర్: టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్.. రవీంద్ర జడేజా(Ravindra Jadeja) టెస్టు కెరీర్లో కొత్త రికార్డును నెలకొల్పాడు. టెస్టుల్లో 300వ వికెట్ తీసి కొత్త మైలురాయిని అందుకున్నాడు. బంగ్లాదేశ్‌తో కాన్పూర్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో అతను ఈ ఘనతను సాధించాడు. బంగ్లా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బ్యాటర్ ఖదీల్ అహ్మద్‌ను ఔట్ చేసి ఆ రికార్డును అందుకున్నాడు. టెస్టుల్లో 300 వికెట్లతో పాటు మూడు వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా కూడా రికార్డు క్రియేట్ చేశాడు. అత్యంత వేగంగా ఆ ఘనతను అందుకున్న రెండవ క్రికెటర్‌గా నిలిచాడు. టెస్టుల్లో 300వ వికెట్ తీసిన ఏడవ భారత బౌలర్‌గా జడేజా రికార్డు నెలకొల్పాడు. టెస్టు కెరీర్లో మైలురాయిగా నిలిచిన ఆ వికెట్ వీడీయోను బీసీసీఐ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది.
That’s the milestone wicket for @imjadeja 👏👏
He picks up his 300th Test wicket. Becomes the 7th Indian to achieve this feat.#TeamIndia #INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/8JlBn3hKfJ
— BCCI (@BCCI) September 30, 2024
భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి జే షా.. తన ఎక్స్ అకౌంట్లో స్పందించారు. టెస్టు క్రికెట్లో 300 వికెట్లు తీసిన జడేజాకు ఆయన కంగ్రాట్స్ తెలిపారు. నిలకడగా, క్రమశిక్షణతో నువ్వు చేసిన బౌలింగ్.. టెస్టు క్రికెట్లో భారత్‌ను ఆధిక్యం దిశగా నడిపినట్లు జే షా పేర్కొన్నారు.
Congratulations @imjadeja for completing 300 wickets in Test match cricket. Your discipline and consistency with the ball have been pivotal in India’s dominant run in the longest format of the game! 🇮🇳#INDvBAN pic.twitter.com/U8u9eeFuf0
— Jay Shah (@JayShah) September 30, 2024