ప్రతిష్టాత్మక ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్(World Test Championship) ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. వచ్చే నెల 18-22 మధ్య సౌతాంప్టన్ వేదికగా ఇరు జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. 1990ల్లో భారత్ ధరించిన జెర్సీల మాదిరిగా నూతన జెర్సీలు ఉన్నాయి. రాబోయే టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యలోని భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీలతో బరిలో దిగనుంది. తాజాగా కొత్త జెర్సీని ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ధరించి సోషల్మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. రివైండ్ టు 90 అని వ్యాఖ్యానించాడు.
జెర్సీ మీద ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ 2021 అని రాసి ఉంది. కొత్త జెర్సీలకు భారత క్రికెట్ ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ పోస్ట్ చాలా తక్కువ సమయంలోనే ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఎంపీఎల్ స్పోర్ట్స్ టీమ్ఇండియాకు కొత్త కిట్లను అందజేసింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ జెర్సీలతో కోహ్లీసేన బరిలో దిగనుంది.
⏪Rewind to 90’s 👕 #lovingit #india pic.twitter.com/bxqB6ptfhD
— Ravindrasinh jadeja (@imjadeja) May 29, 2021