Ravindra Jadeja | ‘ఆమె వల్లే మాఇంట్లో విభేదాలు’.. తండ్రి మాటల్ని కొట్టిపారేసిన జడ్డూ
Ravindra Jadeja : భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja)కు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. అతడి తండ్రి అనిరుధ్ సిన్హ్(Anirudh Sinh) ఇంటర్వ్యూనే అందుకు కారణం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో జడేజా తండ్రి..
Ravindra Jadeja : భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja)కు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. అతడి తండ్రి అనిరుధ్ సిన్హ్(Anirudh Sinh) ఇంటర్వ్యూనే అందుకు కారణం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో జడేజా తండ్రి.. అతడి భార్య రివబ(Rivaba)పై సంచలన ఆరోపణలు చేశాడు. దాంతో, ఈ స్టార్ ఆటగాడు ఆమెకు మద్దతుగా నిలిచాడు. ఎమ్మెల్యే అయిన తన భార్య ప్రతిష్టను దెబ్బతీయానే తన తండ్రి అసత్య ఆరోపణలు చేశాడని జడ్డూ అన్నాడు.
‘అదొక చెత్త ఇంటర్వ్యూ. అతడు చేసిన ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా తండ్రి మాటల్ని నేను ఖండిస్తున్నా. ఇదంతా నా భార్య గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నంలో భాగమే’ అని శుక్రవారం ఇన్‌స్టాలో జడేజా పోస్ట్ పెట్టాడు.
Let’s ignore what’s said in scripted interviews 🙏 pic.twitter.com/y3LtW7ZbiC
— Ravindrasinh jadeja (@imjadeja) February 9, 2024
జడేజా తండ్రి అనిరుధ్ ఈమధ్య దివ్య భాస్కర్(Divya Bhaskar) ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ‘జడేజా నా కొడుకు అయినందుకు నా గుండె మండిపోతోంది. రివబను అతడు 2016 ఏప్రిల్‌లో పెండ్లి చేసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకోవడం నాకు అస్సలు నచ్చలేదు. రివబ మా ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి మా కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి. రివబ దృష్టంతా జడేజా డబ్బు మీదనే. పెండ్లి అయిన కొన్ని రోజులకే ఆమె ఆస్తి మొత్తం తన పేరిట రాయాలని మావాడిని ఇబ్బంది పెట్టింది’ అని అనిరుద్ ఆ ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశాడు. అతడి వీడియో క్షణాల్లో మీడియాలో వైరల్ అయింది.
రవీంద్ర జడేజా

ఉప్పల్ టెస్టులో గాయపడిన జడేజా ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో కోలుకుంటున్నాడు. తన ఆరోగ్యం మెరుగవుతోందంటూ అతడు గురువారం ఆన్లైన్లో పోస్ట్ పెట్టాడు కూడా. ఫిబ్రవరి 15న మొదలయ్యే రాజ్‌కోట్ టెస్టుకు జడ్డూ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది తెలియదు. నిరుడు గుజరాత్ ఎన్నికల్లో జామానగర్(JamaNagar) ఉత్తర నియోజకవర్గం నుంచి జడేజా భార్య రివబ ఎమ్మెల్యేగా గెలుపొందింది.
ఇవి కూడా చదవండి
- Bharat Ratna | పీవీని ‘భారతరత్న’ వరించడం యావత్ తెలంగాణ గర్వించదగ్గ విషయం: హరీశ్‌రావు
- KK | తెలంగాణ బిడ్డ పీవీకి భారతరత్న ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలు : కె.కేశవరావు
- AP CM Jagan | ప్రధాని మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

