Ravindra Jadeja : అహ్మదాబాద్ టెస్టులో సెంచరీతో పాటు నాలుగు వికెట్లతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు రవీంద్ర జడేజా (Ravindra Jadeja). రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లతో నడ్డివిరిచిన జడ్డూ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తన బౌలింగ్ పార్ట్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) లేకుండా తొలిసారి స్వదేశంలో సిరీస్ ఆడుతున్నాని వెల్లడించాడు జడేజా. అంతేకాదు అశ్విన్‌ను చాలా మిస్ అవుతున్నట్టు చెప్పాడీ ఆల్‌రౌండర్.
‘నిజంగానే మేము అశ్విన్‌ను మిస్ అవుతున్నాం. అతడు చాలా ఏళ్లు జట్టుకు విశేష సేవలందించాడు. అశ్విన్ లేకుండా స్వదేశంలో టెస్టు ఆడుతుండడం కొంచెం కొత్తగా ఉంది. ఇంతకుముందు నా ఓవర్ పూర్తయ్యాక అశ్విన్.. అతడి తర్వాత నేను ఇలా బౌలింగ్ చేసేవాళ్లం. కానీ, వీడ్కోలు పలికాడనే విషయం గుర్తుకువచ్చాక అతడు బౌలింగ్ చేయడు కదా అని అనుకుంటా. ఒకవేళ నేను రిటైర్ అయిన తర్వాత కూడా నా గురించి కూడా అలానే భావిస్తారు.
Ravindra Jadeja missing his spin partner, R. Ashwin. 🥹#RavindraJadeja #RavichandranAshwin #TestCricket #TeamIndia pic.twitter.com/fdzBaH6Q0H
— OneCricket (@OneCricketApp) October 4, 2025
ప్రస్తుతం కుల్దీప్, వాషింగ్టన్ సరిపోను మ్యాచ్‌లు ఆడారు. కాబట్టి వాళ్లను యంగ్‌స్టర్స్ అనడంలో అనడం కరెక్ట్ కాదు. వాళ్లిద్దరిది భిన్నమైన జోడీ. ఇక బ్యాటింగ్‌లో రాణించడంపై మానసికంగానూ దృష్టి సారించాను. నా ఆలోచనను కొంచెం మార్చుకొని గతంలో కాకుండా ఎక్కువ సమయం క్రీజులో ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తున్నా’ అని జడ్డూ తెలిపాడు. జట్టును గెలిపించిన ప్రదర్శన చేసినందుకు జడ్డూ 11వ సారి టెస్టుల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. టీమిండియా తరఫున సచిన్ 14 సార్లు ఈ అవార్డుతో అగ్రస్థానంలో ఉండగా.. ద్రవిడ్ నెట్టేసి రెండో స్థానంలోకి దూసుకొచ్చాడీ లెఫ్ట్ హ్యాండర్.
తొలి టెస్టులో వెస్టిండీస్ బౌలర్లను చెడుగుడు ఆడుకుంటూ ధ్రువ్ జురెల్(Dhruv Jurel)తో కలిసి 206 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడీ వెటరన్. జురెల్ ఔటైన తర్వాత సెంచరీ బాదిన జడేజా టెస్టుల్లో ఆరోసారి మూడంకెల స్కోర్ అందుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో భారత జట్టు విజయాల్లో అశ్విన్, జడేజాలది మరచిపోలేని పాత్ర. ఈ ఇద్దరూ కలిసి 58 మ్యాచుల్లో 587 వికెట్లు పడగొట్టారు. నిరుడు డిసెంబర్లో ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలోనే యశ్ హఠాత్తుగా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
𝙒𝙖𝙧𝙧𝙞𝙤𝙧’𝙨 𝙀𝙛𝙛𝙤𝙧𝙩 ⚔
1️⃣0️⃣4️⃣* runs with the bat 👏
4️⃣/5️⃣4️⃣ with the ball in the second innings 👌Ravindra Jadeja is the Player of the Match for his superb show in the first #INDvWI Test 🥇
Scorecard ▶ https://t.co/MNXdZceTab#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/xImlHNlKJk
— BCCI (@BCCI) October 4, 2025