Ravindra Jadeja | విజేతగా వీడ్కోలు.. టీ20ల్లో ముగిసిన జడ్డూ శకం
Ravindra Jadeja : యావత్ దేశమంతా పొట్టి ప్రపంచ కప్ గెలుపు సంబురాల్లో ఉండగా భారత సీనియర్ క్రికెటర్లు వీడ్కోలు బాట పడుతున్నారు. తాజాగా మేటి ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) సైతం టీ20లకు బై బై చెప్పేశాడు.
Ravindra Jadeja : యావత్ దేశమంతా పొట్టి ప్రపంచ కప్ గెలుపు సంబురాల్లో ఉండగా భారత సీనియర్ క్రికెటర్లు వీడ్కోలు బాట పడుతున్నారు. టీ20 వరల్డ్ కప్ విజయోత్సాహంలోనే విరాట్ కోహ్లీ (Virat Kohli), కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)లు పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేశారు. వరల్డ్ కప్ అందుకొని ఒక్క రోజు గడిచిందో లేదో మేటి ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) సైతం టీ20లకు బై బై చెప్పేశాడు. టీమిండియా చిరస్మరణీయ విజయాల్లో కీలక పాత్ర పోషించిన జడేజా.. రెండు టీ20 వరల్డ్ కప్‌లు గెలిచిన జట్టులో సభ్యుడు.
‘గుండెనిండా కృతజ్జతా భావంతో నేను టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నా. ఎంతో గర్వంగా కెరీర్‌ను ముగిస్తున్నా. దేశానికి ఆడిన ప్రతిసారి నా అత్యుత్తమ ప్రతిభ కనబరిచాను. ఇక మిగతా ఫార్మాట్లలోనూ అదే తరహాలో ఆడుతా. పొట్టి ప్రపంచ కప్ గెలవాలనే కల నిజమైంది. ఇది నా టీ20 కెరీర్లో గొప్ప ఘట్టం. ఇన్ని రోజులు నాకు మద్ధతుగా ఉన్న అభిమానులందరికీ ధన్యవాదాలు’ అని జడేజా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చాడు.
2009లో అరంగేట్రం
స్పిన్ ఆల్‌రౌండర్ అయిన జడేజా 2009లో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకూ 74 మ్యాచ్‌లు ఆడిన జడ్డూ 515 రన్స్ కొట్టాడు. బంతితోనూ చెలరేగిన ఈ ఆల్‌రౌండర్ 54 వికెట్లు పడగొట్టాడు. 2022లో జడేజా టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఆ ఏడాది ఇంగ్లండ్‌పై 29 బంతుల్లోనే 46 రన్స్ చేశాడు. ఇక బౌలింగ్‌లో ఐర్లాండ్‌పై 3/15తో ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
ఇవి కూడా చదవండి
- Google Maps | గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని పోతే.. నట్టేట ముంచింది..!
- IAS Karthikeya Mishra | ఏపీ సీఎం అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ కార్తికేయ మిశ్రా
- Akhilesh Yadav | రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం : అఖిలేష్ యాదవ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

