Google Maps | గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని పోతే.. నట్టేట ముంచింది..!
Google Maps | గతంలో ఎవరైనా తెలియని ప్రాంతాలకు వెళితే ముందే రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకునేవారు. ఎక్కడైనా దారితప్పితే ఎవరి సహాయమైనా తీసుకుంటుండేవారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నది. కొత్త ప్రాంతాలకు వెళ్లిన సమయంలో గూగుల్ మ్యాప్స్‌ను వాడడం అందరికీ అలవాటుగా మారింది.
Google Maps | గతంలో ఎవరైనా తెలియని ప్రాంతాలకు వెళితే ముందే రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకునేవారు. ఎక్కడైనా దారితప్పితే ఎవరి సహాయమైనా తీసుకుంటుండేవారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నది. కొత్త ప్రాంతాలకు వెళ్లిన సమయంలో గూగుల్ మ్యాప్స్‌ను వాడడం అందరికీ అలవాటుగా మారింది. అయితే, చాలా సందర్భాల్లో ఈ మ్యాప్స్‌లో అడ్రస్ సరిగ్గా చూపిస్తున్నా.. అప్పుడప్పుడు ఇబ్బందులు తప్పడం లేదు. పలువురు ప్రమాదాల బారినపడ్డ సందర్భాలు సైతం ఉన్నారు.
తాజాగా కేరళకు చెందిన యువకులకు సైతం ఇదే చేదు అనుభవం ఎదురైంది. కేరళ కాసర్‌గోఢ్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు ఆసుపత్రికి కర్నాటకలోని ఆసుపత్రికి బయలుదేరారు. రూట్‌మ్యాప్ కోసం గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగించారు. యువకులు ప్రయాణిస్తున్న కారు హఠాత్తుగా నదిలోకి దూసుకుపోయింది. నదిలో నీటి ఉధృతికి కారు కొట్టుకుపోగా.. ఇద్దరు యువకులు చెట్టును పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. అబ్దుల్ రషీద్‌తో పాటు మరో యువకుడు ఆదివారం వేకువ జామున పొరుగన ఉన్న కర్ణాటకలోని ఆసుపత్రికి వెళ్తున్నామని.. నావిగేషన్ కోసం గూగుల్ మ్యాప్స్‌ని ఉపయోగిస్తున్నట్లు తెలిపాడు.
గూగుల్ మ్యాప్స్ తమను ఇరుకైన దారిగుండా తీసుకెళ్లిందని.. వాహనం హెడ్‌లైట్ వెలుగులో ముందు కొంచెం నీరు కనిపించిందని.. నదిపై ఉన్న వంతెనపై ఉన్నామని ఊహించలేదని చెప్పాడు. వంతెనపై సైడ్‌వాల్ సైతం కనిపించలేదని చెప్పాడు. ఆ తర్వాత కారు అకస్మాత్తుగా నీటిలో కొట్టుకుపోయిందని.. నది ఒడ్డున చెట్టుకు చిక్కుకుందని తెలిపాడు. ఫైర్‌ఫోర్స్ సిబ్బందిని సంఘటనా స్థలానికి చేరుకొని తమను కాపాడారని తెలిపాడు. ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదని.. ఇది తమకు పునర్జన్మ అని తెలిపాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Google Maps
- karnataka
- Kerala
- river
RELATED ARTICLES
తాజా వార్తలు
418 movie | ప్రశాంత్ నీల్ హార్రర్ థ్రిల్లర్ ‘418’ను థియేటర్లలో మిస్సయ్యారా..?
Woman Hires Friends To Kill Boyfriend | ఫ్రెండ్స్ సహాయంతో ప్రియుడ్ని కిడ్నాప్ చేసి చంపేందుకు మహిళ యత్నం.. ఐదుగురు అరెస్ట్
NRI | దీక్షా దివాస్‌ను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఎన్నారై శాఖలన్నీ సిద్ధం కావాలి : మహేష్ బిగాల
Sweets | పండుగల సమయంలో స్వీట్లు, ఇతర ఆహారాలను అధికంగా తినొద్దంటే.. ఇలా చేయాలి..
Mahabubabad | మహబూబాబాద్ యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

