చెన్నై: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కూ వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్ విదేశీ లీగ్‌లు ఆడే దిశగా అడుగులు వేస్తున్నాడు. యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ లీగ్ (ఐఎల్) టీ20లో ఆడేందుకు అతడు రంగం సిద్ధమైంది. ఐఎల్ టీ20 తర్వాతి సీజన్ కోసం సెప్టెంబర్ 30న దుబాయ్ వేదికగా వేలం జరగాల్సి ఉంది.
ఈ వేలంలో పేరు నమోదుచేసుకోవాలని అశ్విన్ భావిస్తున్నాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘అవును. ఐఎల్ టీ20 నిర్వాహకులు నన్ను సంప్రదించారు. వేలంలో నేను పేరు నమోదుచేసుకుంటే ఏదైనా జట్టు నన్ను దక్కించుకుంటుందనే ఆశాభావంతో ఉన్నా’ అని చెప్పాడు.