లండన్: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు ఇది భారీ ఊరట కలిగించే విషయమే. ప్రాక్టీస్ కోసం కౌంటీ క్రికెట్ ఆడుతున్న స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఒక ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీశాడు. సర్రే తరఫున ఆడుతున్న అతడు.. సోమర్సెట్పై తొలి ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లు వేసినా కేవలం ఒక వికెటే తీశాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తనదైన స్టైల్లో చెలరేగి బౌలింగ్ చేశాడు. అతని స్పిన్ మాయాజాలానికి సోమర్సెట్ బ్యాట్స్‌మెన్ నిలవలేకపోయారు.
కేవలం 69 పరుగులకే ఆలౌటయ్యారు. అశ్విన్ 15 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్ సిరీస్‌కు ముందు అశ్విన్ ఫామ్‌లోకి రావడం ఇండియన్ టీమ్‌కు కలిసొచ్చేదే. ఫిబ్రవరిలో సొంతగడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్‌పై అశ్వినే టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో ఆగస్ట్ 4న తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.
Watch all six wickets for @ashwinravi99 at The Kia Oval this morning, as Somerset were bowled out for just 69.
— Surrey Cricket (@surreycricket) July 14, 2021
👀 @DelhiCapitals @BCCI pic.twitter.com/4ybYW4dAno