చెన్నై: టీమ్ఇండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్పై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. జట్టు నుంచి తప్పుకోవాలని తననెవరూ బలవంతపెట్టలేదని, అది తన వ్యక్తిగత నిర్ణయమని తెలిపాడు. ఈ మేరకు అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. ‘జట్టులోంచి వెళ్లిపొమ్మని నన్నెవరూ బలవంతం చేయలేదు.
వాస్తవానికి నేను ఈ నిర్ణయాన్ని ఇద్దరు ముగ్గురికి చెప్పగానే వారు నాతో వద్దని వారించారు. నేను మరింతకాలం ఆడాలని వాళ్లు కోరుకున్నారు. రోహిత్, గౌతీ భాయ్ (గంభీర్) కూడా నా నిర్ణయంపై పునరాలోచించాలని సూచించారు. కానీ రిటైర్మెంట్ పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం’ అని చెప్పుకొచ్చాడు. 39 ఏండ్ల అశ్విన్ నిరుడు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు మూడో టెస్టు తర్వాత అనూహ్యంగా వీడ్కోలు పలుకగా ఈ ఏడాది ఐపీఎల్‌కూ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం విదితమే.