చెన్నై: సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు ఇటీవలే వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్ తనకు కెప్టెన్సీ దక్కలేదున్న పశ్చాత్తామపమేమీ లేదని అన్నాడు. అలాగే తాను ఘనమైన వీడ్కోలును కోరుకోలేదని, అలాంటి వాటికి తాను వ్యతిరేకమని తెలిపాడు. రిటైర్మెంట్ తర్వాత అశ్విన్ తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ పై విధంగా స్పందించాడు.
గ్రాండ్ సెండ్ ఆఫ్‌లు సూపర్ సెలబ్రిటీ సంస్కృతిలో భాగమని తాను భావిస్తానని, అలాంటి వాటికి తాను దూరంగా ఉంటానని అన్నాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌కు మాత్రమే వీడ్కోలు పలికానని క్రికెట్ గురించి మాట్లాడటం, కోచింగ్‌ను ఇష్టపడతానని అశ్విన్ తెలిపాడు. తన రిటైర్మెంట్కు ఎవరూ బాధ్యులు కాదని, ఎవరైనా ఉన్నా వాళ్ల గురించి తనకు తెలియదని చెప్పుకొచ్చాడు.