ప్రస్తుతం వన్డే క్రికెట్ ఫార్మాట్ ప్రమాదంలో ఉన్నట్లు పలువురు విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్.. తను వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఈ చర్చ మరింత పెద్దదైంది. ఈ క్రమంలో భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
గతంలో 60 ఓవర్లు ఉన్న వన్డేలను 50 ఓవర్లకు కుదించిన విషయాన్ని గుర్తుచేసిన రవిశాస్త్రి.. వీటిని మరోసారి కుదించాలని సూచించాడు. వన్డే క్రికెట్ చాలా కాలంగా 50 ఓవర్లుగా ఉందని, దీన్ని కూడా తగ్గించొచ్చు కదా అని అన్నాడు. మరి వన్డే క్రికెట్కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.