సౌతాంప్టన్: న్యూజిలాండ్‌తో ప్రతిష్టాత్మక టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు సన్నద్ధమవుతోంది. సౌతాంప్టన్‌లోని ఏజీస్ బౌల్ మైదానంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. మంగళవారం సాధన ముగిసిన తర్వాత టీమ్ఇండియా హెడ్‌కోచ్ రవిశాస్త్రి సరదాగా శునకంతో ఆడుకున్నాడు. టీమ్ఇండియా ప్రాక్టీస్ సెషన్ తర్వాత విన్స్టన్(శునకం)కు టెన్నిస్ బాల్‌ను విసిరి క్యాచ్ అందుకోమన్నాడు. బంతిని అందుకున్న తర్వాత ఆ శునకం మైదానంలో పరుగెత్తుతూ వచ్చి శాస్త్రికి బంతిని అందించింది. శునకంతో క్యాచ్‌లు పట్టిస్తున్న వీడియోను రవిశాస్త్రి ట్విటర్లో షేర్ చేశాడు.
Our buddy Winston earns himself a tennis ball after #TeamIndia’s practice session #WTCfinal 🇮🇳 pic.twitter.com/tEeLYS3xBs
— Ravi Shastri (@RaviShastriOfc) June 15, 2021