Border Gavaskar Trophy | టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రేపట్నుంచే ప్రారంభం కానుంది. నాగ్‌పూర్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌లో టీమిండియా చోటు దక్కించుకోవచ్చు. దీంతో క్రికెట్ అభిమానుల దృష్టి అంతా ఇప్పుడు ఈ మ్యాచ్‌పైనే ఉంది. ఈ క్రమంలోనే తొలి టెస్టు తుది జట్టు కోసం సీనియర్ క్రికెటర్లు తుది జట్టును ప్రకటిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి కూడా తన ప్లేయింగ్ XI ను ప్రకటించారు.
రవి శాస్త్రి ప్లేయింగ్ XIలో కొన్ని అనూహ్య నిర్ణయాలు ఉన్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్‌గా శ్రీకర్ భరత్ బదులు ఇషాన్ కిషన్‌ను ఎంచుకుని రవిశాస్త్రి ఆశ్చర్యపరిచారు. ఇక ఓపెనర్‌గా కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ మధ్య తీవ్ర పోటీ ఉండనుందని తెలిపారు. దీనిపై కోచ్, కెప్టెన్ కలిసి తుది నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. ఇక ఐదో స్థానంలో శుభ్మన్గిల్కు బదులు సూర్యకుమార్ యాదవ్‌ను ఎంచుకున్నాడు. స్పిన్నర్‌గా అక్షర్ పటేల్‌కు బదులు కుల్దీప్ యాదవ్‌ను తీసుకున్నాడు. ఈ మూడు ప్రతిపాదనలు కూడా క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాయి. వీటిని పక్కనబెడితే మిగిలిన జట్టు ఆటగాళ్ల జాబితా మొత్తం ముందుగా ఊహించినట్లే ఉంది.
రవి శాస్త్రి ఎంచుకున్న జట్టు ఇదే..