ముంబై: వన్డే సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీని తప్పించడాన్ని భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఒక విధంగా సమర్థించాడు. ప్రస్తుత బయోబబుల్ కాలంలో అన్నీ బాధ్యతలు ఒక్కరే చూసుకోవడం కష్టమని తెలిపాడు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ‘బోల్డ్ అండ్ బ్రేవ్: రవిశాస్త్రి వే’ కార్యక్రమంలో వన్డే కెప్టెన్సీ మార్పుపై స్పందించాడు. ‘ఇది సరైన మార్గమని నేను భావిస్తున్నా. ఇంకొక ఏడాది కూడా బయోబబుల్‌లో ఉండాల్సిన పరిస్థితి. ఈ సమయంలో అన్నీ బాధ్యతలు ఒక వ్యక్తి చూసుకోవడం కష్టం. ఈ నిర్ణయం కోహ్లీ, విరాట్‌కు మేలు చేసేలా ఉంది’ అని తెలిపాడు. కోహ్లీ, రోహిత్‌తో ఉన్న అనుబంధంపై రవిశాస్త్రి స్పందిస్తూ… ‘ఓపెనర్‌గా రోహిత్‌ను తీసుకురావడంలో ఒకటే ఆలోచించా. అద్భుతమైన ప్రతిభ ఉన్న రోహిత్‌ను బ్యాటర్‌గా వెలుగులోకి తీసుకురాకుంటే కోచ్‌గా నేను విఫలమైనట్టేనని భావించా. కోహ్లీ, నేను ఒకే రకంగా ఆలోచిస్తాం. కొంచెం దూకుడు స్వభావం కలిగిన వాళ్లం. గెలవాలనే తపనతో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తాం. టెస్టుల్లో 20 వికెట్లు కావాల్సిన సమయంలో ఎలాంటి బెరుకు లేకుండా ఆడాలనుకుంటాం. భయం ఆవరిస్తే అది అంటువ్యాధిగా సోకుతుంది’ అని మాజీ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు.