సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో సీనియర్ పేసర్ షమీని ఆడించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని, తానైతే అతడిని తప్పకుండా ఆసీస్‌కు తీసుకెళ్లేవాడినని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ‘ఐసీసీ రివ్యూ’లో శాస్త్రి మాట్లాడుతూ.. ‘వాస్తవంగా చెప్పాలంటే షమీ గురించి మీడియాలో జరుగుతున్న ప్రచారం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది.
అసలు అతడు కోలుకున్నాడా? ఎక్కడ ఉన్నాడు? ఎన్సీఏకి వెళ్లాడా? అక్కడ ఎన్నిరోజులు ఉన్నాడు? వీటిపై సరైన సమాచారం ఎందుకు బయటకు రాలేదు? షమీ సామర్థ్యం ఉన్న బౌలర్. నేనైతే అతడిని తప్పకుండా ఆసీస్‌కు తీసుకెళ్లేవాడిని. అక్కడే రిహాబిలిటేషన్‌కు ఏర్పాటు చేసేవాడిని. అతడుంటే జట్టు మరింత బలంగా ఉండేది. మూడో టెస్టు నాటికి అతడు ఫిట్నెస్ సాధించకుంటే అప్పుడు అతడిని వదిలేసేవాడిని’ అని అన్నాడు.