చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. దీపక్ హుడా వేసిన రెండో ఓవర్లో ఓపెనర్ క్వింటన్ డికాక్(3) ఔటయ్యాడు. తర్వాతి ఓవర్లలో పంజాబ్ కట్టుదిట్టంగా బంతులేయడంతో పవర్‌ప్లే ఆఖరికి 21/1తో నిలిచింది. ఐపీఎల్ 2021లో ఇప్పటి వరకు పవర్‌ప్లేలో నమోదైన అత్యల్ప స్కోరు ఇదే.
దారుణంగా తడబడిన ముంబై తొలి ఆరు ఓవర్లలో వరుసగా 4,3,3,2,5,4 పరుగులే చేసింది. క్రీజులో కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నా స్కోరు బోర్డు ముందుకు కదలట్లేదు. రవి బిష్ణోయ్ వేసిన ఏడో ఓవర్ ఆఖరి బంతికి ఇషాన్ కిషన్(6) ఔటవడంతో ముంబైపై ఒత్తిడి పెరిగింది. ఏడు ఓవర్లు ముగిసేసరికి ముంబై రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులే చేసింది. రోహిత్(17), సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నారు.
Playing his first game of #IPL2021, Bishnoi makes an immediate impact as he has Ishan Kishan 6 (17) caught behind by KL Rahul. #MI are 37-2 after 8 overs https://t.co/NMS54FiJ5o #VIVOIPL #PBKSvMI pic.twitter.com/hciWU2sAFI
— IndianPremierLeague (@IPL) April 23, 2021