లండన్ : అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 చరిత్రలో సరికొత్త రికార్డు లిఖించాడు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ‘ది హండ్రెడ్’ టోర్నీలో లండన్ స్పిరిట్ తరఫున ఆడుతున్న రషీద్.. ఓవల్ ఇన్విసిబుల్స్తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి పొట్టి ఫార్మాట్లో 650 వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా రికార్డులకెక్కాడు.
ఈ మ్యాచ్‌లో 20 బంతులేసిన రషీద్.. 11 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. టీ 20 (అంతర్జాతీయ, లీగ్‌లు కలిపి)లలో రషీద్ 478 ఇన్నింగ్స్‌లలో 651 వికెట్లు తీయగా విండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో 631 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.