Rashid Khan : పొట్టి క్రికెట్లో ప్రమాదకరమైన బౌలర్‌గా పేరొందిన రషీద్ ఖాన్ (Rashid Khan) సరికొత్త చరిత్ర లిఖించాడు. తనకు అచ్చొచ్చిన టీ20ల్లో అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరించాడీ అఫ్గనిస్థాన్ కెప్టెన్. పురుషుల పొట్టి ఫార్మాట్లో 164 వికెట్లతో దిగ్గజ బౌలర్లకు సాధ్యంకాని రికార్డు నెలకొల్పాడీ మిస్టరీ స్పిన్నర్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)పై తన స్పెల్ చివరి బంతికి ధ్రువ్ పరాషర్ను ఔట్ చేసి రషీద్ ఈ మైలురాయికి చేరుకున్నాడు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో మ్యాచ్‌కు ముందు టీ20 అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రషీద్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లతో మెరిసిన అఫ్గన్ కెప్టెన్ న్యూజిలాండ్ పేస్ టిమ్ సౌథీ (Tim Southee) పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టాడు. 98 మ్యాచుల్లో 13.75 సగటుతో రషీద్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.
The leading wicket-taker in the format will play his 99th T20I today 🎩 pic.twitter.com/oyTXaCulhq
— ESPNcricinfo (@ESPNcricinfo) September 2, 2025
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సౌథీ ఖాతాలో 164 వికెట్లు ఉన్నాయి. కివీస్‌కే చెందిన ఇష్ సోధీ(Ish Sodhi) 150 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఆడుతున్న వాళ్లలో సోధీ, ముస్తాఫిజుర్(Mustafizur) మాత్రమే రషీద్‌కు దరిదాపుల్లో ఉన్నారు.
రషీద్ ఖాన్ (అఫ్గనిస్థాన్) – 165 వికెట్లు, ఎకానమీ 6.07.
టిమ్ సౌథీ (న్యూజిలాండ్) – 164 వికెట్లు, ఎకానమీ 8.00.
ఇష్ సోధీ (న్యూజిలాండ్) – 150 వికెట్లు, ఎకానమీ 7.95.
షకీబుల్ హసన్ (బంగ్లాదేశ్) – 149 వికెట్లు, ఎకానమీ 6.81.
ముస్తాఫిజుర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్) – 142 వికెట్లు, ఎకానమీ 7.30.
లెగ్ స్పిన్నర్ అయిన రషీద్ ఖాన్ కెరీర్ ఆరంభం నుంచి అంతుచిక్కని బౌలింగ్‌తో బ్యాటర్లను ఇరుకున పెట్టేవాడు. చిన్న జట్టుగా ముద్రపడిన అఫ్గనిస్థాన్ పెద్ద జట్లకు షాకివ్వడంలో అతడు కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్‌లోనూ ఈ స్పిన్ సంచలనం వికెట్ల వేటతో చెలరేగాడు. గుజరాత్ టైటాన్స్ (Gujrat Titans) జట్టు అరంగేట్రం సీజన్లోనే ఛాంపియన్‌గా నిలవడంలో రషీద్ పాత్ర ఉంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకూ అతడు 149 వికెట్లు పడగొట్టాడు.