చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్(28) రాణించడంతో పవర్‌ప్లే ఆఖరికి ఢిల్లీ 51/0తో నిలిచింది. యువ బ్యాట్స్‌మన్ షా ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. షా 35 బంతుల్లోనే 7ఫోర్లు, సిక్స్ సాయంతో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. రషీద్ ఖాన్ వేసిన 11వ ఓవర్లో ధావన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం పృథ్వీ షా(51) భారీ స్కోరు దిశగా సాగుతున్నాడు. 10.2 ఓవర్లకు ఢిల్లీ వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది.
5⃣0⃣ and going strong 💪
— IndianPremierLeague (@IPL) April 25, 2021
Prithvi Shaw brings up a fine half-century 👏👏https://t.co/9lEz0r9hZo #SRHvDC #VIVOIPL pic.twitter.com/jqSAA7FjfN