హనుమకొండ చౌరస్తా, మార్చి 24: పాట్నాలో ఈనెల 27 నుంచి 30 వరకు జరిగే సబ్‌జూనియర్ జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు తెలంగాణ కబడ్డీ టీం కెప్టెన్‌గా హనుమకొండకు చెందిన రాసాల శివ ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా శివను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అజీజ్‌ఖాన్, కార్యదర్శి సారంగపాణి అభినందించారు.
తాను ఈ స్థాయిలో ఎదగడానికి సహాయపడిన వారికి, జిల్లా కబడ్డీ సంఘానికి శివ కృతజ్ఞతలు తెలిపారు.