Ranji Trophy | రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బీ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై విదర్భ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ అద్భుత సెంచరీ, స్పిన్నర్ హర్ష్‌దూబే బెస్ట్ బౌలింగ్‌తో 221 పరుగుల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ వాడ్కర్ (139), యష్ రాథోడ్ (98), ఆల్ రౌండర్ నచికేత్ భూటే (87) రెండో ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించారు. విదర్భ తొమ్మిది వికెట్లకు 428 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఎడమచేతి వాటం స్పిన్నర్ దూబే 19 ఓవర్లు వేసి 51 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్త 10 వికెట్లు తీశాడు.
ఈ విజయంతో విదర్భ ఆరు పాయింట్లు సాధించి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. రాజస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 265 పరుగులు చేసింది. దాంతో విదర్భ వంద పరుగుల వెనుకంజలో నిలిచింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో క్లిష్ట పరిస్థితిలో కెప్టెన్ అక్షయ్ వాడ్కర్.. రాథోడ్‌తో కలిసి 94 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రాథోడ్ తృటిలో సెంచరీ సాధించే అవకాశం కోల్పోయాడు. వాడ్కర్, భూటేల 172 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో విదర్భ మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఉదయం 7 వికెట్లకు 358 పరుగుల స్కోర్ చేసిన విదర్భ.. నాలుగో రోజు మరో 70 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రాజస్థాన్ 329 పరుగుల విజయ లక్ష్యం నిర్దేశించింది.
అక్షయ్ వాడ్కర్ 269 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయ సెంచరీ చేశాడు. నచికేత్ బూటీ ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 87 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన 22 ఏళ్ల దూబే.. రెండో ఇన్నింగ్స్‌లో మరో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆఫ్ స్పిన్నర్ అక్షయ్ వఖరే మూడు వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరు కలిసి రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్‌ను కూల్చడంతో రాజస్థాన్ 43.3 ఓవర్లలో ఆలౌట్ అయ్యింది. గ్రూప్-బీలోని ఇతర మ్యాచ్‌లలో ఆంధ్ర-పుదుచ్చేరి మ్యాచ్ డ్రాగా ముగియగా.. హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్ 43 పరుగుల తేడాతో హిమాచల్‌ప్రదేశ్‌ను ఓడించింది.