బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Mar 05, 2020 , 00:09:50

బెంగాల్‌ X సౌరాష్ట్ర

బెంగాల్‌ X సౌరాష్ట్ర
  • రంజీ ఫైనల్‌ జట్లు ఖరారు

రాజ్‌కోట్‌: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన సౌ రాష్ట్ర జట్టు.. వరుసగా రెండో ఏడాది రంజీ ట్రోఫీ ఫైనల్‌ చేరింది. బుధవా రం ముగిసిన రెండో సెమీఫైనల్లో ఉనాద్కట్‌ సారథ్యంలోని సౌరాష్ట్ర 92 పరుగుల తేడాతో గుజరాత్‌ను చిత్తుచేసింది. 327 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 7/1తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన గుజరాత్‌ చివరకు 234 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ పార్థివ్‌ పటేల్‌ (93), చిరాగ్‌ గాంధీ (96) పోరాడినా ఫలితం లేకపోయింది. ఒక దశలో 63 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ గుజరాత్‌ను పటేల్‌-గాంధీ ద్వయం ఆదుకుంది. ఈ జోడీ ఆరోవికెట్‌కు 158 పరుగులు జోడించి ఆశలు రేపినా.. సౌరాష్ట్ర కెప్టెన్‌ ఉనాద్కట్‌ (7/56) విజృంభించడంతో గుజరాత్‌ ఓటమి పాలైంది. 


logo