న్యూఢిల్లీ: దేశవాళీ దిగ్గజం షెల్డన్ జాక్సన్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన 15 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌కు సౌరాష్ట్ర స్టార్ బ్యాటర్ జాక్సన్ పుల్‌స్టాప్ పెట్టాడు. రంజీ ట్రోఫీలో గుజరాత్‌తో క్వార్టర్ ఫైనల్ తనకు ఆఖరిదని మంగళవారం ప్రకటించాడు. తన కెరీర్లో 105 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన 38 ఏండ్ల జాక్సన్ 7200 పరుగులు సాధించాడు. ఇందులో 21 సెంచరీలు, 39 అర్ధసెంచరీలు ఉన్నాయి.