Hyderabad | హైదరాబాద్ ఆట ప్రతినిధి: దేశవాళీ ప్రతిష్టాత్మక రంజీ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఎలైట్ గ్రూప్-బీలో ఉన్న హైదరాబాద్.. ఉప్పల్లో పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్లో ఇన్నింగ్స్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్ నైట్ స్కోరు 171/2 వద్ద నాలుగో రోజు ఆరంభించిన పుదుచ్చేరి.. 333 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో ఓపెనర్ గంగ శ్రీధర్ రాజు (106) శతకంతో మెరిశాడు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ (7/106) ఏడు వికెట్లతో మెరిసి ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తనయ్కే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
ఇండోర్: మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్ రంజీలలో ధనాధన్ ఆటతో మెరుపు శతకం బాదాడు. హర్యానాతో జరిగిన మ్యాచ్లో అతడు 68 బంతుల్లోనే సెంచరీ (102 బంతుల్లో 159, 13 ఫోర్లు, 7 సిక్సర్లు) సాధించాడు. రంజీలలో ఇది ఐదో అత్యంత వేగవంతమైన శతకం. 2016 సీజన్లో పంత్ 48 బంతుల్లోనే త రంజీల్లో వేగవంతమైన శతకాన్ని నమోదుచేశాడు.