కళ్యాణి (బెంగాల్) : రంజీ ట్రోఫీలో బెంగాల్ సెమీఫైనల్స్‌కు ప్రవేశించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించిన ఆ జట్టు.. మంగళవారం ముగిసిన మూడో క్వార్టర్స్‌లో ఆంధ్రాపై ఇన్నింగ్స్ 90 పరుగుల తేడాతో నెగ్గింది.
తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 629 పరుగుల భారీ స్కోరు సాధించగా ఆంధ్రా.. తొలి ఇన్నింగ్స్‌లో 295, రెండో ఇన్నింగ్స్‌లో 244 రన్స్‌కే కుప్పకూలింది. సెమీస్‌లో బెంగాల్.. జమ్మూకశ్మీర్‌తో తలపడనుంది.