KJP Demands | నీట్ మృతులకు కోటి పరిహారం.. కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్స్ ఇవే..!
KJP Demands : ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాతో కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు మంత్రి ముందు మూడు ప్రధాన డిమాండ్లను ఉంచారు.
KJP Demands : కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన ‘ఛలో పార్లమెంట్’ ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ మార్చ్‌కు అనుమతి లేదని ముందే చెప్పిన పోలీసులు నిరసనకారులను అడ్డుకోవడంతో.. ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా(JP Nadda)తో కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు భేటీ అయ్యారు. చర్చలకు కేంద్రం సానుకూలంగా ఉండడంతో ఇద్దరు ప్రతినిధులు నడ్డాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మంత్రి ముందు మూడు ప్రధాన డిమాండ్లను ఉంచారు. తమ షరతులకు అంగీకరిస్తేనే ఉద్యమాన్ని నిలిపివేస్తామని వారు నడ్డాకు స్పష్టం చేశారు.
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై జవాబుదారీతనం కోసం పోరాడుతున్న కాక్రోజ్ జనతా పార్టీ పంతం వీడడం లేదు. సోమవారం ఛలో పార్లమెంట్‌ను పోలీసులు అడ్డుకుంటుండగానే.. ఆ పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డాను కలిశారు. మంత్రితో భేటీ సందర్భంగా తమ మూడు డిమాండ్లు ఆయన ముందుంచారు. ఒకటి.. పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ను ఎలాంటి ఆంక్షలు లేకుండా విడుదల చేయాలి.
VIDEO | Delhi: After meeting Union Minister JP Nadda, Cockroach Janta Party (CJP) spokesperson Ashutosh Ranka says, “We came to Nadda ji’s residence at around 12 o’clock. We met him at around 2:15 pm. We placed 3 demands before him. First, Sonam Wangchuk ji should be released… pic.twitter.com/L2M7uJROzf
— Press Trust of India (@PTI_News) July 20, 2026
రెండోది.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. మూడోది.. నీట్ ప్రశ్నాప్రత్నం లీకేజీ అనంతరం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. ఈ మూడు డిమాండ్లను ఒక లేఖలో రాసి నడ్డాకు సీజేపీ నాయకులు మెమోరాండం సమర్పించారు.
CJP activists met Union Minister JP Nadda at his residence and submitted their demands:
– Immediate release of Sonam Wangchuk + video address
– Resignation of Education Minister Dharmendra Pradhan
– ₹1 crore compensation to families of students who died by suicide#CJPProtest… pic.twitter.com/3m7Bj91qCQ— The Alternate Media (@AlternateMediaX) July 20, 2026
ప్రభుత్వంతో మాట్లాడేందుకు నిరసనకారులు సిద్ధమని చెప్పడంతో.. ఉదయం 11:50 గంటల వరకు చర్చలు జరిగాయని జేపీ నడ్డా ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘సీజేపీ ప్రతినిధులతో సహృదయ వాతావరణంలో చర్చలు జరిగాయి. ఆ పార్టీ నాయకులతో ప్రాథమికంగా ముఖాముఖి చర్చలు జరిపాను. సాయంత్రం 4 గంటల సమయంలో వారు నాకు రాతపూర్వకంగా ఒక వినతి పత్రం సమర్పించారు’ అని నడ్డా తన పోస్ట్‌లో వెల్లడించారు.
आज सुबह पहली बार प्रदर्शनकारियों की ओर से सरकार के साथ बातचीत करने का प्रस्ताव आया और सुबह 11:50 AM से ही हमारी बातचीत जारी है।
सौहार्दपूर्ण वातावरण में मुलाकात हुई। उनके डेलीगेशन के साथ विस्तार से पहले मौखिक चर्चा हुई और उनके द्वारा लगभग 4 बजे मुझे लिखित याचिका दी गई।
मैंने… pic.twitter.com/HLCl20RBSp
— Jagat Prakash Nadda (@JPNadda) July 20, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

