Odesa Port | ఉక్రెయిన్‌లో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..!
Odesa Port : ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో నలుగురు భారతీయులు మరణించారు. ఒడెసా పోర్టు(Odesa Port) లోని నౌకపై రష్యా క్షిపణులతో విరుచకుపడింది.
Odesa Port : ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో నలుగురు భారతీయులు మరణించారు. ఒడెసా పోర్టు(Odesa Port) లోని నౌకపై రష్యా క్షిపణులతో విరుచకుపడింది. 10 మంది ప్రాణాలు కోల్పోగా వీరిలో నలుగురు భారతీయులే. మరో ఇండియన్ పరిస్థితి విషమంగా ఉందని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నలుగురు భారతీయుల మృతికి కారణమైన రష్యా దాడిన ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
జూలై 19, ఆదివారం ఎమ్వీ గోల్డెన్ లియో (MV Golden Leo) అనే నౌక 17 మంది సిబ్బందితో ఒడెసా పోర్టు నుంచి బయల్దేరింది. ఈ నాకపై రష్యా దాడి చేయడంతో పది మంది చనిపోయారని విదేశాంగ శాఖ పేర్కొంది. రష్యా దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. వాణిజ్య పడవలను లక్ష్యంగా చేసుకోవడం, పౌరులను చంపడం సమంజసం కాదని.. అలాంటప్పుడు జల స్వేచ్ఛ రవాణా, వాణిజ్యంను నిలిపివేయాలని రష్యాను కోరింది.
On the evening of 19 July 2026, the vessel MV GOLDEN LEO was attacked while departing the port of Odesa. At the time of the incident, there were 17 crew members on board, including 5 Indian nationals. As per information available, four Indian nationals have tragically lost their… pic.twitter.com/N1WkPzNres
— IANS (@ians_india) July 20, 2026
‘ఉక్రెయిన్‌లోని తాజా పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నాం. నౌకా దాడిలో ఆత్మీయులను కోల్పోయిన వారికి, గాయపడిన వారి కుటుంబాలకు సాధ్యమైనంత సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం’అని సోమవారం విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

