Ranji Trophy 2024 | ఉత్కంఠగా ముగిసిన రంజీ ట్రోఫీ – 2024 తొలి సెమీఫైనల్స్‌లో మాజీ ఛాంపియన్ మధ్యప్రదేశ్‌కు ఓటమి తప్పలేదు. విదర్భతో నాగ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో విదర్భ.. 62 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆఖరి రోజు మధ్యప్రదేశ్ విజయానికి 93 పరుగులు కావాల్సి ఉండగా విదర్భకు 4 వికెట్లు అవసరమయ్యాయి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసిన ఎంపీ.. మరో 30 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్, అక్షయ్ వఖారెలు తలా మూడు వికెట్లు పడగొట్టారు.
ఆఖరి రోజు ఇరు జట్లు విజయం కోసం బరిలోకి దిగినా ఆ జట్టుకు ఆదిలోనే డబుల్ షాకులు తాకాయి. కుమార్ కార్తికేయతో పాటు అనుభవ్ అగర్వాల్‌లు డకౌట్లు అయ్యారు. సారాన్ష్ జైన్.. 69 బంతుల్లో 25 పరుగులు చేశాడు. చివరి వరుస బ్యాటర్ కుల్వంత్ కెజ్రోలియా (11) ను యశ్ ఠాకూర్ బౌల్డ్ చేయడంతో విదర్భ ఫైనల్ బెర్త్‌ను ఖరారుచేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో (170) విఫలమైనా విదర్భ.. రెండో ఇన్నింగ్స్‌లో 402 రన్స్ చేసింది. మధ్యప్రదేశ్.. తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్‌లో 258 రన్స్‌కు ఆలౌట్ అయింది.
𝐕𝐢𝐝𝐚𝐫𝐛𝐡𝐚 𝐚𝐫𝐞 𝐢𝐧𝐭𝐨 𝐭𝐡𝐞 𝐟𝐢𝐧𝐚𝐥! 🙌🙌
They beat Madhya Pradesh by 62 runs in a tightly fought contest.
A terrific comeback from the Akshay Wadkar-led side 👌@IDFCFIRSTBank | #VIDvMP | #RanjiTrophy | #SF1
Scorecard ▶️ https://t.co/KsLiJPuqXr pic.twitter.com/YFY1kaO1x7
— BCCI Domestic (@BCCIdomestic) March 6, 2024
ఫైనల్లో విదర్భ.. 41 సార్లు రంజీ ఛాంపియన్ ముంబైతో తలపడనుంది. విదర్భకు ఇది మూడో రంజీఫైనల్. ఫైనల్ చేరిన ప్రతిసారి విదర్భ రంజీ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకోవడం విశేషం.