Dear Comrade | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలయికలో వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తన ‘ధర్మ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై ఈ సినిమా హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. ఇందులో విజయ్ దేవరకొండ పోషించిన చైతన్య (బాబీ) పాత్రలో యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది నటించనున్నట్లు.. అలాగే రష్మిక మందన్న పోషించిన క్రికెటర్ లిల్లీ పాత్ర కోసం ‘లాపతా లేడీస్’ సినిమాతో మెప్పించిన ప్రతిభా రంతను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ చిత్రాన్ని కేవలం రొటీన్ రీమేక్‌లా కాకుండా, నేటి తరం అభిరుచులకు తగ్గట్టుగా మార్పులు చేస్తూనే.. అసలు కథలోని ఆత్మ దెబ్బతినకుండా తెరకెక్కించాలని కరణ్ జోహార్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే కరణ్ జోహార్ ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే నటీనటులు మరియు దర్శకుడికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.