హైదరాబాద్, ఆట ప్రతినిధి : రంజీ ట్రోఫీ రెండో అంచె పోటీలలో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న గ్రూప్-బి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా గురువారం మొదలైన మ్యాచ్‌లో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (272 బంతుల్లో 137 నాటౌట్, 14 ఫోర్లు) అజేయ శతకం సాధించగా అభిరాత్ రెడ్డి (73), రాహుల్ రాదేశ్(52) హాఫ్ సెంచరీలతో కదం తొక్కడంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 2 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. తన్మయ్‌తో పాటు వరుణ్ (21 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఆకాశ్, అపూర్వ్ ఒక్కో వికెట్ తీశారు.