Hyderabad | హైదరాబాద్: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ ఎలైట్ 2024-25 సీజన్‌ను హైదరాబాద్ ఓటమితో ఆరంభించింది. స్థానిక జింఖానా గ్రౌండ్స్ వేదికగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 126 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్.. తొలి ఇన్నింగ్స్‌లో 343 పరుగులకు ఆలౌట్ కాగా హైదరాబాద్ 248 పరుగులకే కుప్పకూలింది.
అనంతరం గుజరాత్ రెండో ఇన్నింగ్స్‌లో 201 రన్స్ చేయగా 297 పరుగుల ఛేదనలో హైదరాబాద్ 170 పరుగులకు ఆలౌట్ అయి భారీ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ జట్టు బ్యాటర్ మనన్ హింగ్రజియాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక మిగిలిన మ్యాచ్‌లలో హిమాచల్ ప్రదేశ్, సర్వీసెస్ హర్యానా, కేరళ, తమిళనాడు, బరోడా, విదర్భ విజయాలు సాధించాయి. ఈ టోర్నీలో రెండో అంచె పోటీలు ఈనెల 18 నుంచి మొదలవుతాయి.