Ranji Season | నాగ్‌పూర్: రంజీ సీజన్ 2025లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఫైనల్ చేరాలంటే కొండంత లక్ష్యాన్ని కరిగించాల్సి ఉంది. నాగ్‌పూర్ వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆ జట్టు ఎదుట విదర్భ 406 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో విదర్భ 292 పరుగులకు ఆలౌట్ అయింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 83/3గా నిలిచింది.
ఆ జట్టు విజయానికి ఐదో రోజు 323 పరుగులు చేయాల్సి ఉంది. శివమ్ దూబె (12 నాటౌట్), ఆకాశ్ ఆనంద్ (27 నాటౌట్) క్రీజులో ఉన్నారు. కేరళతో జరుగుతున్న మరో సెమీస్‌లో తొలి ఇన్నింగ్స్‌లో గుజరాత్ నాలుగో రోజు ఏడు వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసింది. కేరళ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 457 రన్స్‌కు ఆలౌట్ అవగా గుజరాత్ మరో 28 పరుగులు వెనుకబడి ఉంది.